బావిలో దూకి ఇద్దరు యువతుల ఆత్మహత్య
యువతులిద్దరూ వరుసకు అక్కచెల్లెేళ్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అక్షర కిరణం, (సాలూరు): పాచిపెంట మండలం బొర్రామామిడి పంచాయతీ బొడ్డపాడు గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరా లిలా ఉన్నాయి. బోర్రమామిడి సర్పంచ్ సోయ్యారి రాము లమ్మ కుమారుడు శ్రీరాములు, సెబి సంబురమ్మ(24) గత రెండేళ్లుగా ప్రేమించుకోంటున్నారు. ఈక్రమంలో ఏడాది కిందట పెద్దల సమక్షంలో వివాహ సంబంధం కుదుర్చు కున్నారు. అయితే గత కొంతకాలం నుంచి శ్రీరాములు, సెబి సంబురమ్మ ఇద్దరిమధ్య మనస్పర్ధలు చోటుచేసుకుంటు న్నాయి. దీంతో సంబూరమ్మ తన సన్నిహితురాలు, వరసకు సోదరి అయిన పోయి లక్ష్మి వద్దకు వెళ్లి శ్రీరాములుకు తనకు మధ్య కొంతకాలం నుంచి జరుగుతున్న మనస్పర్థల ను చెప్పి బాధపడేది. ఈక్రమంలో సోమవారం రాత్రి సంబురమ్మా లక్ష్మి వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నట్టు సమాచారం. ఈక్రమంలో సంబురమ్మ మనస్థాపంతో తనకు జీవించాలని లేదని చెప్పింది. అది విన్న లక్ష్మి నువ్వు చనిపోతే నేనుకూడా నీతోపాటు చనిపోతానని సంబురమ్మతో చెప్పినట్టుగా వారి మాటలు విన్న బంధువులు చెబుతున్నారు. అయితే వీరిద్దరు మాటవరుసకు ఇలా అని ఉంటారని భావించిన బంధువులు పెద్దగా పట్టించుకోలేదు. సోమ వారం రాత్రి అందరు నిద్రపోయిన తరువాత సెంబురమ్మ, లక్ష్మి ఇద్దరు తమ చేతులకు చున్నీ కట్టుకుని బొడ్డపాడు గ్రామ సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం నీళ్ల కోసం బావి వద్దకు వచ్చిన గ్రామస్థులు బావిలో వీరిద్ధరి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మంగళవారం వారి మృతదేహాలను బయటకు తీసి బుధవారం పోస్టుమార్టం నిమిత్తం సాలూరు పీహెచ్సీకి తరలించారు. సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పాచిపెంట ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా వీరిద్దరి మృతితో బొడ్డపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరిద్దరూ నిజంగానే ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని భావించలేదంటూ వీరి మాటలు విన్న బంధువులు రోధిస్తున్నారు.