కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు
ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ విభాగం చైర్మన్ మూల వెంకటరావు పరామర్శ
అక్షర కిరణం, (మాధవధార): కలుషితాహారం తిని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్లు, నర్సులు చాలా నిబద్ధతతో పిల్లలకు చికిత్స చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలు నడుపుతున్న ఆశ్రమాలు, హాస్టల్లో నిర్వహణపై రాష్ట్రంలో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. పెళ్లిలు, ఇతర వినోద కార్యక్రమాలలో మిగులు ఆహారాన్ని స్వచ్ఛంద సంస్థలో లేదా అనాధ శరణాలయాలకు అందించే పద్ధతిపై నిషేధించాల న్నారు. ఈ విషయమై రాష్ట్రంలో ఉన్న అన్ని ఫంక్షన్ హాల్ లకు నోటీసులు జారీ చేయాలన్నారు. భవిష్యత్తులో ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియోజక వర్గం స్థాయిలో అధికారిని నియమించి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విశాఖపట్నంలో పోలీస్, పబ్లిక్ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న పాపా హోం సంస్థ ఇటువంటి ఆహారంపై చాలా నిబద్ధతతో వ్యవహరిస్తారన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే ప్రైవేట్ సంస్థల తరపున నిర్వహిస్తున్న హాస్టల్లో అనాథ శర ణాలయాలపై తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని మూల వెంకట్రావు కోరారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశాఖపట్నం వచ్చి పిల్లలకు,వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకటరావు డిమాండ్ చేశారు.