నామినేటెడ్ పదవులు ఖరారు చేసిన చంద్రబాబు!
కటీటీడీ చైర్మన్‌గా టీవీ చానెల్ యజమాని? కదశల వారీగా పోస్టుల ప్రకటన
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటనకు సిద్దమైంది. ప్రఖ్యాత టీటీడీ చైర్మన్‌తో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులను ప్రకటించనుంది. ఇప్పటికే మూడు పార్టీల నేతలు నామినేటెడ్ పదవుల భర్తీ పైన కసరత్తు చేసారు. కీలక పదవులను ఖరారు చేశారు. మూడు పార్టీల నుంచి నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. దశలవారీగా పోస్టులను ప్రకటిం చనున్నారు. తొలి దశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది.
టీటీడీ చైర్మన్‌గా టీవీ చానల్ యజమాని?
టీటీడీ ఛైర్మన్ పదవి కోసం టీవీ ఛానల్ యజమాని పేరు ఖరారైంది. తొలి నుంచి ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తున్నా..టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు పేరు సైతం పరిశీలనలోకి వచ్చింది. అయితే ఉత్తరాంధ్రకు ఇప్పటి వరకు దక్కిన ప్రాధాన్యతతో టీటీడీ ఛైర్మన్ మీడియా సంస్థ అధినేతకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులను పార్టీ సీనియర్లు.. తాజా ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి కేటాయించాలని నిర్ణయించారు.
పదవులు ఖరారు!
కాగా మంగవారం తొలి విడత నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు, డిజిటల్ కార్పోరేషన్ చైర్మన్‌గా జీవీ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా దేవినేని ఉమాకు ఆర్టీసీ చైైర్మన్, ప్రవీణ్ కుమార్‌రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పోరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్‌కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.
మాల కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ, మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వాసం మునియ్య పేర్లు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో 90 వరకూ కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. దాదాపు 30 శాతం పదవులు తొలి విడతలోనే భర్తీ చేయ నున్నారు. ఇక.. పదవుల పంపకాల్లో మూడు పార్టీలు ఒక ఫార్ములా ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చాయి.