గుర్లలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత పర్యటన
కబాధితులకు పరామర్శ
అక్షర కిరణం, (గుర్ల/విజయనగరం): గుర్ల గ్రామంలో రాష్ట్ర హోంశాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత గురువారం పర్యటించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆమె బాధితులను పరామర్శించారు. వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వైద్య చికిత్సపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో పర్యటించి, కాలువలను, తాగునీటి పైప్లైన్లను, పారిశుధ్యాన్ని పరిశీలిం చారు. పారిశుధ్య కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాల కలుషితం గురించి ఆరా తీశారు. గ్రామస్తులతో మాట్లాడారు. ఇళ్లలోకి వెళ్లి అధి కారులు సీజ్ చేసి బోర్లను పరిశీలించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటిని మాత్రమే వినియోగించాలని మంత్రి అనిత సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, చీపురుపల్లి శాసన సభ్యులు కిమిడి కళా వెంకటరావు, నెల్లిమర్ల, ఎస్.కోట ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, ఎస్.కోట లలితకుమారి, రాష్ట్ర మార్కెఫెడ్ ఛైర్మన్ బంగార్రాజు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.