విశాఖ`విజయవాడ ఎయిర్ సర్వీస్ పున:ప్రారంభం
కహర్షం వ్యక్తం చేసిన విశాఖ ఎంపీ శ్రీభరత్
అక్షర కిరణం, (విశాఖపట్నం): వైజాగ్`విజయవాడ ఉదయం ఎయిర్ సర్వీస్ తిరిగి ప్రారంభమైంది. దీనిపై విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై త్వరితగతిన స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ శ్రీభరత్ కృతజ్ఞతలు తెలిపారు. గత నెలలో రద్దయిన వైజాగ్-విజయవాడ ఉదయం ఇండిగో విమాన సర్వీసు జూన్ 1వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. దీనిపై వైజాగ్ ఎంపీ శ్రీభరత్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిమాన సర్వీస్ పునరుద్ధరణకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఎంపీ శ్రీభరత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈవిమాన సేవ వాణిజ్య, పర్యాటక, పరిపాలనా ప్రయాణికులకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
వైజాగ్-విజయవాడ మధ్య ఉదయపు విమాన సర్వీస్ వాణిజ్యపరంగా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సేవ తిరిగి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఇంకా విశాఖ నుండి ఇతర ముఖ్య నగరాలకు విమాన కనెక్టివిటీ మెరుగుపరచేందుకు కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.