బాలుడి మృతికి కారణమైన గంజాయి స్మగ్లింగ్ కేసులో మహిళ సహా మరో ఇద్దరు అరెస్టు
అక్షర కిరణం (కంచరపాలెం): ఈనెల 12వ తేదీ నా కారు ఢీకొని సుభాష్ నగర్ వద్ద ఏడాదిన్నర వయసు చిన్నారి వర్షిత్ మృతి చెందిన ఘటనలో కారు సీజ్ చేసిన క్రమంలో ఈ నెల 16వ తేదీన కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ కారును తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో 21 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు కారు నడుపు తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘం(24) ఇటీవలే రిమాండ్కు తరలించారు. ఈకేసులో ఒక యువతితోపాటుగా మరో ఇద్దరు యువకు లను కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఘటనకు సంబంధించి కంచరపాలెం సీఐ కె.రవికుమార్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘం (24) ఈనెల 11న రాత్రి విజయవాడ వద్ద ఒక ప్రైవేట్ సంస్ధలో ఆన్లైన్ తో కారును అద్దెకుతీసుకొని అరకు వెళ్లి అక్కడ 21 కిలోల గంజాయి కొనుగోలు చేసుకొని ఎన్ఏడీ కొత్తరోడ్ మీదుగా విశాఖ రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తున్న క్రమంలో ఊర్వశి జంక్షన్ బీఆర్టీఎస్ రహదారికి వస్తున్న సమయంలో అటుగా రోడ్డు దాటుతున్న దంపతులను ఢీకొన్నాడు. అయితే ఈప్రమాదంలో ఏడాదిన్నర బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలిం చారు. ఈనెల 16న విజయవాడ నుండి కారు తాళాలను తెప్పించిన ట్రాఫిక్ పోలీసులు కారు తనిఖీ చేయగా కారు డిక్కీలో 21కిలోల గంజాయిని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు లు కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి అర్జున్ను రిమాండ్కు తరలించారు. ఘటనలో పరారీలో ఉన్న హైదరాబాద్ హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన చందు అక్షయ గౌతమి(20), ఒంగోలుకు చెందిన పేర్లీ విజయవర్ధన్ రాజు(25), ఒంగోలు, బాపట్లకు చెందిన షేక్ మహమ్మద్ జాకీర్ (19) ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు వెల్లడిరచారు. పేర్లీ విజయ వర్ధన్ రాజుపై ఇప్పటికే 11 కేసులు ఉన్నాయని, షేక్ మహమ్మద్ జాకీర్పై అనకాపల్లి జిల్లా కోడూరులో ఒక గంజాయి కేసు ఉందన్నారు. కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ రవికుమార్, సమీర్లను సీఐ అభినందించారు.