నాలుగు కిలోల గంజాయితో ముగ్గురు నిందితులు అరెస్టు
అక్షర కిరణం, (గాజువాక): గాజువాక జింక్ గేట్ వద్ద 4 కిలోల గంజాయితో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దువ్వాడకు చెందిన తిలపాక నాని, గాజువాక డిపోకు చెందిన జడ్డా రాజేష్, ములగాడకు చెందిన గుజరాపు నితీష్ గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. గంజాయి రవాణా, ఉపయోగిం చిన నిందితుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గాజువాక ఎస్ఐ సూర్యకళ తన సిబ్బందితో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. దీనిపై కేసు దర్యాప్తు చేశారు.