చంద్రబాబుతో వైరం నిజమే.. కాని ఇప్పుడు కాదు
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్య
అక్షర కిరణం (విశాఖపట్నం): తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు చంద్రబాబు నాయుడుతో వరం ఉందని బయట చాలా మంది అంటుంటారు. ఇది నా దృష్టికి కూడా వచ్చింది అన్నారు. అది నిజమే నాకు తనతో వైరం ఉంది. కాని అది ఇప్పుడు కాదు అంటూ చెప్పారు. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలి అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చాలా కాలం తరువాత ఒకే వేదికను పంచుకున్న చంద్రబాబు, దగ్గుబాటి ఈసందర్భంగా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా కరతాళధ్వనులు చోటుచేసుకున్నాయి.