నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
అక్షరకిరణం, (పొందూరు): ఎచ్చర్ల మండలం కుప్పిలిలో మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలతో డీఈవో 14 ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయడంపై ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పొందూరు మండలంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై తమ నిరసన తెలిపారు. వాస్తవాలపై పూర్తిగా విచారణ చేయకుండానే సంబంధం లేని ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం తగదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.