58 కిలోల గంజాయితో నిందితుల అరెస్టు
అక్షర కిరణం, (పలాస): వజ్రపుకొత్తూరు, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వేర్వేరు ఘటనల్లో గంజా యిని తరలిస్తున్న ఏడుగురు ఒడిశా వాసులను అరెస్ట్ చేస ినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు మీడియా సమావేశంలో వెల్లడిరచారు. వజ్రపుకొత్తూరు పోలీసు స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో గంజాయి అక్ర మంగా రవాణా చేస్తున్న ఐదుగురిని వజ్రపుకొత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పలాస నుండి బైక్పై గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఘటనలో పూండి స్టేషన్ వద్ద గంజాయితో బ్యాగ్లతో సంచరిస్తున్న మరో ఇద్దరు ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుమార్సాహు, భారతీ సాహులను అరెస్ట్ చేసి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి 18.280 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు, ఒడిశా నుంచి రెండు బైక్లు పై గంజాయి బ్యాగులతో పలాస రైల్వే స్టేషన్కి వెళ్తున్న ఒడిసాకు చెందిన ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస రైల్వే స్టేషన్ పరిధిలో కొంతకాలంగా ఒడిశా రాష్ట్రం మోహన గ్రామానికి చెందిన బబుల్లా ఉదయగిరిలో తాను పండిరచిన గంజాయిని పలాస రైల్వే స్టేషన్ కేంద్రంగా చెన్నై, బెంగళూరుకు రవాణా చేస్తు అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తన ముఠాకు చెందిన లితు రైట్, జిల్లు, నరేంద్రలతో గంజాయి బ్యాగులను పలాస రైల్వే స్టేషన్కి రెండు బైకులపై రవాణా చేస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు, 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రెండు బైకులు సీజ్ చేశారు. నిందితులపై ఎన్డీపీిఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు, పరారైన నిందితుడు నరేంద్ర కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ.వి. వెంకట అప్పారావు వెల్లడిరచారు.