గంజాయి రవాణా చేస్తున్న నిందితులు అరెస్టు
అక్షరకిరణం, (పలాస): గంజాయి అక్రమరవాణ రెండు కేసులలో నలుగురు నిందితులు పట్టుబడ్డారని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన ప్రకాష్ నరేంద్ర బెహారా, సంజయ్ చౌహన్ 5 కిలోల గంజాయితో పలాస రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుబడ్డారని తెలిపారు. మరో కేసులో కేరళకు చెందిన మహీన్ కన్ను, షాజహాన్ హుస్సేన్ ఇద్దరు ఒడిశా నుండి కేరళకు 20 కిలోల గంజాయి తరలించడానికి సిద్ధంగా ఉండగా పలాస రైల్వేస్టేషన్ రోడ్డు బాబా గుడి వద్ద పట్టుకు న్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులతోపాటు మిగిలిన వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోర్టుకి హాజరుపరుస్తామని తెలిపారు.