స్మగ్లింగ్ కేసులో స్టార్ హీరోయిన్ అరెస్టు
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న కన్నడ నటి రన్యారావు
అక్షర కిరణం, (బెంగళూరు/జాతీయం): విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో భారత్‌కు బంగారం తీసుకు వస్తున్న స్మగ్లర్లు నిత్యం ఎయిర్‌పోర్టుల్లో దొరికిపోతూనే ఉన్నారు. అయినా రకరకాల మార్గాల్లో బంగారాన్ని దాచి.. స్వదేశానికి తీసుకువస్తూ అధికారులు, పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నా.. ఈ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు.. బంగారాన్ని ఎక్కడ దాచి తీసుకువచ్చినా అధికారులు, పోలీసులు.. వల వేసి వారిని పట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నటి.. రెడ్ హ్యాండెడ్‌గా అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది. ఆమె తరచూ దుబాయ్‌కి వెళ్లి అక్రమంగా బంగారం తీసుకువస్తుందని తెలుసుకున్న పోలీసులు.. పక్కా సమాచారం ప్రకారం.. నిఘా వేసి ఆమెను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కన్నడ నటి రన్యా రావు.. దుబాయ్ నుంచి అక్రమంగా 14.8 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ.. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్-డీఆర్ఐ అధికారులకు పట్టుబడిరది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే గత కొన్ని రోజులుగా తరచూ రన్యా రావు దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై నిఘా వేసిన అధికారులు.. పక్కా ప్లాన్ ప్రకారం అమెను అరెస్ట్ చేశారు. గత 15 రోజుల్లో రన్యా రావు.. 4 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందని తెలిపారు. బంగారం బిస్కెట్లను దుస్తుల్లో దాచి.. ఆమె తీసుకొచ్చేవారని డీఆర్ఐ అధికారులు నిర్ధారించారు.
బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావును అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను విచారణ జరుపుతున్నారు. మార్చి 3వ తేదీ(సోమవారం) రోజున ఆమె దుబాయ్ నుంచి తీసుకువచ్చిన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ గోల్డ్ విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. రన్యా రావును డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తుండగా.. తాను డీజీపీ కూతురిని అని ఆమె ప్రచారం చేసుకుంటున్నట్లు గుర్తించారు. గతంలో కూడా రన్యా రావు ఇలాగే అనేక సందర్భాల్లో ఈ రకమైన బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కన్నడలో కిచ్చ సుదీప్తో కలిసి రన్యా రావు.. మాణిక్య అనే సినిమాలో నటించింది. ణం, (పలాస): పలాస కాశీబుగ్గ పదో వార్డు సమస్యలపై లొడగల కామేశ్వర రావు ఆధ్వర్యంలో బుధవారం కాశీబుగ్గ యూనిట్ ఇంచార్జ్ ఉమాకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి కమిషనర్ రామా రావుకు వినతిపత్రం అందజేశారు. పెంటవీధి స్కూల్ వద్ద ఉన్న దేశబట్టి కాల్వపై కల్వర్టు నిర్మించాలని కోరారు. పొందారు వీధి రోడ్లు, కాలువలపై డెంకి వీధిలో రోడ్డు కోసం కోవెల వీధిలో సిసి రోడ్డు, జక్కర గుండం రాయికట్టు నిర్మాణం కోసం కమిషనర్ రామారావుకు వినతిపత్రం అందజేశారు.
వర్కింగ్ జర్నలిస్టులకు డాక్టర్ కంచర్ల సంక్షేమ కవచం
కకేడబ్ల్యుజేడబ్ల్యుఏ లోగో ఆవిష్కరణలో సీపీ శంఖబ్రత
అక్షర కిరణం, (విశాఖపట్నం): వర్కింగ్ జర్నలిస్టుల కు సంక్షేమానికి వెన్నుముఖగా కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(కేడబ్ల్యూజెడబ్ల్యూఏ) దేశంలోనే గుర్తింపు పొందాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్జీ ఆకాంక్షించారు. మంగళవారం జాతీయ అధ్యక్షులు కంచర్ల అచ్యుతరావుతో కలిసి ఆయన కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ ఆర్థిక రాజధాని విశాఖలో మంచి లక్ష్యంతో జర్నలిస్టులకు అత్యంత విలువైన సంక్షేమం చేయడానికి కంచర్ల అచ్యుతరావు లాంటి వ్యక్తి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రారంభం కావడం శుభపరిణామం అన్నారు. విశాఖలో ప్రారంభమైన అసోసియేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అనంతరం కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ జర్నలిస్టులు, మీడియా అంటే తనకు ఆది నుంచి ఎంతో అభిమానమని.. తన జీవితంలో అగ్రభాగం జర్నలిస్టులకు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మారిపోయింద న్నారు. దేశంలోనే ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అసోసి యేషన్ బైలా అందరికీ తెలిసేలా సీపీ శంఖబ్రత బాగ్జీ ప్రారం భించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతీ జర్నలిస్టు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మీడియాలో పనిచేసేవారందరికీ సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించినట్టు చెప్పారు. కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కెబ్ల్యూజెడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక ముసాయిదాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి దానిని అమలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా నగరంలో నకిలీ జర్నలిస్టులను, అనధికార ప్రెస్ వాహనాలను నియం త్రించాలని సీపీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కంచర్ల అచ్యుతరావు సీపీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసి యేషన్ ఉపాధ్యక్షులు పి.బాలభాలను, కార్యదర్శి దుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ సురేష్‌కుమార్, ట్రజరర్ సుధీర్ కుమార్, మెయిన్ కోర్ కమిటీ సభ్యులు కాళ్ల అప్పారావు, సుంకర రాజా, ఈ.గణేష్, అర్జున్‌కుమార్, జగదీష్‌కుమార్, కార్యవర్గ సభ్యులు, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు నాగు, అరుణ తదితరులు పాల్గొన్నారు.