గ్రీవెన్స్‌కు విశేష స్పందన
కవృద్ధురాలి వద్దకు వచ్చి స్వయంగా ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
అక్షర కిరణం, (పలాస): జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ గ్రీవెన్స్ సెల్‌కు విశేష స్పందన లభిస్తోంది. అందిన ఇంతవరకు జిల్లా కేంద్రానికి పరిమిత మైన ఈ గ్రీవెన్స్‌లో టెక్కలి పలాస రెవెన్యూ డివిజన్లకు అతి తక్కువ దూరంలో కాశీబుగ్గ కేంద్రంగా ఉండడంతో స్పందనపై ఫిర్యాదుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కాశీబుగ్గ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 90ఏళ్ల వృద్ధురాలి వద్దకు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్వయంగా వచ్చి ఆమె ఫిర్యాదును స్వీకరించారు. పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామం కస్పా వీధికి చెందిన దుర్గ మహంతి సరోజినీ నడవలేక ఇద్దరు వ్యక్తుల సహకారంతో గ్రీవెన్స్‌కు చేరు కున్నారు. కార్యాలయం లోపలికి వెళ్లడానికి ఆమె నీర సించిపోవడంతో బయటే కూర్చుండిపోయింది. విషయాన్ని గమనించిన మహేశ్వర్ రెడ్డి ఆమె వద్దకు వచ్చి ఫిర్యాదు స్వీకరించారు. సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.