ప్రజల వద్దకు జీసీసీ ఉత్పత్తుల విక్రయాలు
అక్షర కిరణం, (పార్వతీపురం): అటవీ ఉత్పత్తులను గిరిజన కో-ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులు స్వయంగా గిరిజన ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నారు. పసుపు, కుంకుమ, అరకు కాఫీ, కుంకుడుకాయలు, శీకా కాయలు, తేనె, రాజ్మా చిక్కుళ్ళు, త్రిఫలం, రాగులు వంటి అటవీ పంటలను ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే కొనుగోలు చేస్తూ జీసీసీ ఉన్నత అధికారుల సమక్షంలో నూతనంగా ప్రోడక్ట్ తయారుచేసి బొబ్బిలి, సీతానగరం, పలు పట్టణ, మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అటవీ ఉత్పత్తులపై జీసీసీ సంస్థపై తమకు నమ్మకం ఉండడంతో జీసీసీ తయా రుచేసిన ఉత్పత్తులను కొనుగోళ్లు చేస్తున్నామని ప్రజలు ఈసందర్భంగా పేర్కొంటున్నారు. డివిజన్ కార్యాలయం అధికారుల ఆదేశాల మేరకు మేనేజర్ ఏ. మంగ తదితర సిబ్బంది జీసీసీ ఉత్పత్తు లను భారీగా విక్రయిస్తున్నారు.