సాలూరు రూరల్ పీఎస్లో ఎస్పీ తనిఖీలు
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ను పార్వతీపురం జిల్లా ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీచేశారు. ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రొబేషనరీ ఎస్ఐలకు నిర్వర్తించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు. ఎస్పీ మా ట్లాడుతూ గంజాయి, మద్యం అక్రమ రవాణా నియంత్రిం చేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశిం చారు. ప్రొబేషనరీ ఎస్ఐలతో సమావేశమై వారు నిర్వర్తిస్తు న్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. తరుచూ గ్రామాలను సందర్శించాలని, ఏజెన్సీ (ఎక్ష్త్రెమిస్ట్ ప్రభా విత) ప్రాంతాలను సందర్శించాలని, అక్కడ ప్రజలతో సమావేశ మై వారితో మమేకమై వారికీ సైబర్, నక్షలిజమ్ /మత్తు పదార్దాల/నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్ఓపీ/కూంబింగ్ ఆపరేషన్ల గురించి తెలుసుకొని, నిర్వహించాలన్నారు. స్టేషన్కి న్యాయం దక్కు తుందని ఆశతో ప్రజలు వస్తారని, వారితో సామరస్యంగా మెలిగి వారి సమస్యలు పరిష్కరించాలని, నాకాబందీ విధు లు ఇతర స్టేషన్ విధుల గురించి శిక్షణ కాలంలో నేర్చుకో వాలని సూచించారు. ఫిర్యాదుదారులను కలిసి వారి సమ స్యను తెలుసుకొని, తగిన పరిష్కారం చూపాలని అధికారు లను ఎస్పీ ఆదేశించారు. అనంతరం పాచిపెంట పోలీస్ స్టేషన్ హైవే సమీపంలో మాతుమూరు, అలూరు గ్రామాల రహదారుల గుండా ఒడిసా నుండి,ఇతర ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో సాలూరు సీఐ అప్పలనాయుడు. రూరల్ సీఐ రామకృష్ణ. సాలూరు రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి. పాచిపెంట ఎస్ఐ వెంకటసురేష్, ప్రొబేషనరీ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.