సచివాలయంలో చేరిన వర్షపు నీరు
నిర్మాణంలో నాణ్యతలోపమంటూ ఆరోపణలు
అక్షరకిరణం, (పొందూరు): పొందూరు సచివాలయంలో వర్షపు నీరు చేరింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వార్షానికి పొందూరు మండలం తాడివలస సచివాలయం వర్షపు నీటిలో మునిగి పోయింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకపోవడంతో వర్షపునీరు కార్యాలయం లోపలకు చేరింది. సుమారు అర అడుగు వరకు నీరు చేరడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. మోటార్ పెట్టి నీటిని బయటకు తోడాల్సి వచ్చింది. దీనిపై సచివాలయ కార్యదర్శి రాజీవ్ మాట్లాడుతూ సచివాల యంలో వర్షపు నీరు వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీడీవో, పంచాయతీరాజ్ డీఈ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వారు పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారని వివరించారు.