21న 4వ జోన్లో పలు షాపులకు బహిరంగ వేలం
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్లో పలు వాణిజ్య సముదా యాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు 4వ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలి పారు. ఈనెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
జీవీఎంసీ 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలోని డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయం (వార్డు నెం.35, నియర్ స్ప్రింగ్ రోడ్) గ్రౌండ్ ప్లోర్లో 9, 10, 11, 12, 13 (జనరల్), 15(ఎస్సీ) షాపు రూములు, మొదటి అంతస్తులో 2(ఎస్సీ) 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15(జనరల్) షాపు రూములకు వేలం నిర్వహిస్తామన్నారు. జగదాంబ వాణిజ్య సముదాయం (వార్డు నెం.31)లోని 3, 5, 14, 13(ఎస్టీ) షాపు రూములు, పాత బస్టాండ్ ఫేస్-2(వార్డు నెం.35) 1, 2, 3, 4, 5, 6, 8, 10, 11, 13, 14, 7(ఎస్సీ), 9(ఎస్టీ), 12(ఎస్సీ) షాపు రూములకు, పద్మనగర్ వాణిజ్య సముదాయం (వార్డు నెం.39, లక్ష్మిటాకీస్ వద్ద) 1, 4, 6, 7, 11, 12(జనరల్), 8(ఎస్సీ), షాపు రూములు, సూర్యబాగ్ వాణిజ్య సముదాయం (వార్డు నెం.31, జీవీఎంసీ జోన్-4 ఆఫీసు వద్ద) 9(ఫస్ట్ ప్లోర్) షాపు రూము, అంబేద్కర్ కళ్యాణ మండపం (వార్డు నెం.37), రామకృష్ణా రైతుబజార్, రెల్లివీధి రోడ్ సైడ్ మార్కెట్లను 3 సంవత్సరాల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకులీ బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు తెలిపారు.
ఈ వేలంపాటలో పాల్గొనే ఆసక్తిగలవారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పని వేళల్లో 4వ జోనల్ కార్యాలయంలోని పర్యవేక్షకుడిని సంప్రదించాలని జడ్సీ మల్లయ్య నాయుడు తెలిపారు.