ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉంది
కఏపీకి 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే
కమెల్ బోర్న్ సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో లో మంత్రి నారా లోకేష్
అక్షర కిరణం, (మెల్బోర్న్/ఆస్ట్రేలియా/ అంతర్జాతీయం): ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆరో రోజు.. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIదీజ) ప్రతినిధులతో మెల్బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్లో నిర్వహిం చిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానించినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు న్నామన్నారు. దేశంలో మీ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పరిగణించాలో మూడు ప్రధాన కారణాలు చెబుతాను. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయ కత్వం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తు న్నారని తెలిపారు.. పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రానికి ఎలా తీసుకు రావాలో ఆయనకు బాగా తెలుసు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. దీనివల్ల దేశంతో పాటు ఏపీలో కూడా సాఫీగా పెట్టుబడులు పెట్టేందుకు మీకు సహకారం లభిస్తుంది. ఏపీలో 50శాతం మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు ఉన్నారు. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు మేమంతా కసితో పనిచేస్తున్నా మన్నారు. లిమాతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్ అని చెప్పారు. ఏపీకి 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIదీజ) నేషనల్ ఛైర్ దీపక్ రాజ్ గుప్తా, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(మెల్బోర్న్) డాక్టర్ సుశీల్ కుమార్, సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) డైరెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.