26న జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై సమావేశం
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈనెల 26న సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశం మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 26న ఉదయం 11 గంటలకు నిర్వహించే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్న ఎక్స్ అఫీషియో మెంబర్లు, వార్డు మెంబర్లకు, కౌన్సిల్ హాల్ ప్రాంగణంలోనికి ప్రవేశించిన తరువాత మొబైల్ ఫోన్లను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవాలని సూచించారు. ఎక్స్అఫీషియో మెంబర్, వార్డ్ మెంబర్లకు మాత్రమే సమావేశ మందిరంలోకి అనుమతి ఉంటుందని, ఇతరులను ఎవరినీ కౌన్సిల్ సమావేశం ప్రాంగణంలోకి అనుమతించరని తెలిపారు. వార్డు మెంబర్లు తమ ఐడెంటిటీ కార్డుతో హాజరు కావాలని, ఈ సమావేశా నికి నియమించిన రో అధికారులకు, ఐడెంటిఫికేషన్ అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.