ఆర్టీసీ బస్సును ఢీకొన్న మహింద్ర థార్
కబోల్తా పడిన ఆర్టీసీ బస్సు కకారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కపరిస్థితి విషమం
అక్షర కిరణం, (గుర్ల/విజయనగరం ప్రతినిధి): విజయనగరం-పాలకొండ రోడ్డుపై గుర్ల శ్మశానవాటిక వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడిరది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చీపురుపల్లి నుంచి విజయ నగరం వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సును మహీంద్ర తార్ కారు ఢీ కొట్టింది. ప్రమాదాన్ని తప్పించాలనే ఉద్దేశ్యంతో రోడ్డు సైడు వైపునకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెళ్లాడు. రోడ్డు సైడు జారిపోవడంతో ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయలతో బస్సులోని ప్రయాణికులు బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి గుర్ల ఎస్ఐ పిసిని నారాయణరావు, సిబ్బంది చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం, పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.