విశాఖలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్
కపర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచనున్న బ్రిడ్జి క 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు తట్టుకునేలా నిర్మాణం క 500 టన్నుల బరువు మోసేలా నిర్మాణశైలి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. రూ. 7 కోట్లతో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తుఫాన్లు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా 40 ఎంఎం మందం గల జర్మన్ గ్లాస్‌తో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ గాజు వంతెన 500 టన్నుల బరువును మోయగలదు.
విశాఖపట్నం కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ (గాజు వంతెన) ఎట్టకేలకు ప్రారంభం అయింది. ఇప్పటివరకు కేరళలోని 40 మీటర్ల గాజు వంతెన పొడవైనదిగా ఉండేది. కైలాసగిరి గాజు వంతెన.. ఆ రికార్డును బ్రేక్ చేసింది. 50 మీటర్లతో ఇప్పుడు దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్‌గా చరిత్ర సృష్టిం చింది. వీఎంఆర్డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ.7 కోట్లతో నిర్మిం చిన ఈ వంతెన సోమవారం (డిసెంబర్ 1న) ప్రారంభం అయింది. ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన ప్రణవ్‌గోపాల్.. వీఎం ఆర్డీఏతో పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామ న్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
తుఫానులు తట్టుకునేలా..
తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ను డిజైన్ చేసినట్లు ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ గాజు వంతెనతో పాటు.. త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గ్లాస్‌ను ఉపయోగిం చారు. జర్మనీ నుంచి దీన్ని ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. పర్యటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మిచిన ఈ గాజు వంతెన.. ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టు కోగ లదు. ఒకేసారి దాదాపు 40 మంది టూరిస్ట్ లు ఎక్కి ప్రకృతి అందాలు వీక్షించవచ్చు. సరికొత్త అనుభూతిని పొందొచ్చు. ఈ గ్లాస్ బ్రిడ్జి గురించి ఆనంద్ మహీంద్రా గతంలో ట్వీట్ కూడా పెట్టారు.
నిజానికి ఈ బ్రిడ్జిపైన ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యం ఉంది. కానీ భద్రత దృష్ట్యా కేవలం 40 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ బ్రిడ్జిపైకి ఎక్కి చూస్తే.. చుట్టూ ఎత్తయిన కొండలు, కింది భాగంలో లోయ, దూరంగా సముద్రం కనువిందు చేస్తుంది. గాల్లో తేలియాడుతు న్నట్లుగా.. కొత్త లోకంలో విహరిస్తున్న భావన కలుగుతుంది అంటున్నారు. రాత్రివేళల్లో త్రివర్ణ రంగులతో కూడిన విద్యుత్తు కాంతులతో కైలాసగిరి గాజు వంతెన మెరిసిపోతోంది. ఉన్నతాధికారులు, నిర్వాహ కులతో చర్చించి ఎంట్రీ ఫీజు నిర్ణయించ నున్నారు. ఈ గాజు వంతెన పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ అన్నారు.