అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల శంకుస్థాపన అక్షర కిరణం (పెందుర్తి): జీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి ఆధ్వర్యంలో 93వ వార్డ్‌లో పలు అభి వృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శంకు స్థాపన చేశారు. సాయి దుర్గానగర్, చంద్రపురి కాలనీ, ప్రహ్లాదపురం, పల్లి నారాయణపురం, సమతా కాలనీలలో 2 కోట్ల 69 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్స్, రిటర్నింగ్ వాల్స్, యూసీడీ పైప్‌లైన్ పనులకు కార్పొరేటర్ రాపర్తి కన్నా, జీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు తామాడ ఆదిబాబు, గంగా వరహా, కన్ని మాధవ, దాసరి బుజ్జి, దాసరి శ్రీను, గంగా విజయ్, గాంధీ, దాసరి అచ్చుబాబు, దాసరి పెద్ది నాయడు, కర్రి వెంకటేష్, కర్రి పైడిరాజు, పిన్నింటి పార్వతి, పిల్లా జగన్మోహన్ పాత్రుడు, సింహాచలం నాయుడు, మోటురు చైతన్య, బంటు సురేష్, కిషోర్, ముక్క సంతోష్, వరహాలు, గొల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.