హరిహర వీరమల్లు సినిమా విజయవంతం చేయాలంటూ ఎమ్మెల్యే పంచకర్ల బైక్ ర్యాలీ
అక్షర కిరణం (పెందుర్తి): జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలంటూ పెందుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఉదయం సబ్బవరం అసుకపల్లి వద్ద ప్రారంభించిన ఈ బైక్ ర్యాలీ సరిపల్లి మీదుగా పెందుర్తి చేరుకొని అక్కడినుండి సుజాతనగర్ మీదుగా ఆర్ఆర్ వెంకటాపురం చేరుకుంది. భారీగా తరలి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులతో ఈ ర్యాలీ 25 కిలోమీటర్లు కొనసాగింది. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడు తూ నిన్నటి నుండి పెందుర్తి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడిరదన్నారు. పెందుర్తి నియోజక వర్గంలో పలు దేవాలయాల్లో సినిమా విజయవంతం కావా లంటూ పూజ నిర్వహించామన్నారు. పవన్ కళ్యాణ్ నటించి న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరారు. కార్యక్రమం లో పెందుర్తి నియోజకవర్గం 3 మండలాలకు చెందిన జనసేన నాయకులు, పార్టీ మండల, వార్డు అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.