పోలీసుల అదుపులో ప్రేమోన్మాది నవీన్
కశ్రీకాకుళం జిల్లా బూర్జలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అక్షర కిరణం (విశాఖపట్నం సిటీ): మధురవాడలో యువతి, ఆమె తల్లిపై దాడికి పాల్పడిన ప్రేమోన్మాదిని శ్రీకా కుళం జిల్లా పోలీసులు బూర్జలో అదుపులోకి తీసుకు న్నారు. దీనికి సంబంధించిన వివరాలిలను విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ మీడియాకు వెల్లడిరచారు. విశాఖ మధురవాడలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడైన ప్రేమోన్మాది నవీన్‌ను శ్రీకాకుళం జిల్లా పోలీసు లు పట్టుకున్నట్టు తెలిపారు. విశాఖ నుండి శ్రీకాకుళం మీదుగా పాలకొండ వైపు నిందితుడు నవీన్ వెళుతుండగా బూర్జ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. పరారవుతున్న క్రమంలో ఎవరూ తనను పోల్చకుండా ఉండేందుకు నిందితుడు నవీన్ మార్గమధ్యంలో తన దుస్తులను, బైక్‌ను మార్చేసినట్టు వివరించారు.
పైడి భీమవరం నుంచి వెంబడిస్తూ బూర్జ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవల్లిక ఆధ్వర్యంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చీ తెలిపారు.