రూ.1,14,239 ఆస్తి పన్ను చెల్లించిన లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రి
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీని లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రి వినియోగించుకున్నట్టు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపుదారు లు తమ ఆస్తి పన్నును ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రి యాజమాన్యం తమ ఆస్తి పన్ను చెల్లించి 5 శాతం రాయితీను వినియోగించుకున్నట్టు తెలిపారు. తమ ఆస్తి పన్ను చెక్కును రూ.1,14,239లు అందించిందని జీవీ ఎంసీ అదనపు కమిషనర్ డీవీ.రమణమూర్తి మంగళవారం తెలిపారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఆస్తి, ఖాళీ జాగా పన్నుపై రాయితీని లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్ వారు వినియోగించుకొని ఆస్తి పన్ను చెల్లించారని వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, తమ ఆస్తి పన్నులను చెల్లించి 5 శాతం రాయితీ పొంది విశాఖ నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ జాగా పన్నులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రాయితీ 2025 ఏప్రిల్ 30తో ముగుస్తుందని, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఆస్తిపన్నుపై వడ్డీపై రాయితీను 50 శాతం 2025 ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించినందున ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని అదనపు కమిషనర్ తెలిపారు. ఆస్తి పన్ను దారులు తమ పన్నును ఆన్లైన్లోగాని, జీవీ ఎంసీ అన్ని సౌకర్యం కేంద్రాల్లో, సంబంధిత బ్యాంకుల్లో, సచి వాలయాలలో చెల్లించుకోవాలని విశాఖ నగర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.