29న పెందుర్తి పాలిటెక్నిక్ కాలేజ్లో జాబ్ మేళా
అక్షరకిరణం, (విశాఖపట్నం సిటీ): నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు. ఈజాబ్ మేళాలో లీ ఫార్మా, కేఎల్ గ్రూప్, టీఏవో డిజిటల్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ టెక్ పూర్తిచేసిన యువతీ యువకులందరూ హజరుకా వచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులందరూ విశాఖపట్నం, గాజువాక, చెన్నైలలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 9014766143 సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు హెట్ప్స్:// నైపుణ్యం.అప్.గొవ్.ఇన్/వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కుడా ఉందని తెలిపారు.