కనకమహాలక్ష్మి దేవాలయంలో మార్గశిర మహోత్సవం ఉత్సవ కమిటీ పరిచయ కార్యక్రమం
అక్షర కిరణం, (విశాఖపట్నం): కనకమాహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాల నిర్వహణకు సంబంధిం చిన ఉత్సవ కమిటీ పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీని కార్యనిర్వహక అధికారి శోభారాణి ఆధ్వర్యం లో కమిటీ సభ్యులకు కండువా వేసి శుభాకాంక్షలు తెలి పారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మ వారి ఉత్సవం ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులు, కూటమి నేతలు పాల్గొన్నారు. 32వ వార్డు నేరెళ్ళ కోనేరు వద్ద శ్రీ గణేశ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కౌంటర్‌ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించి, భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, వార్డు అధ్యక్షులు అర్జున్, ఆలయ పెద్దలు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
29 వ వార్డు చందక వీధి వద్ద సుబ్రహ్మణ్య స్వామి షష్టి మహోత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.