మర్రిపాలెం రైతు బజార్లో వ్యవసాయ, వాణిజ్య, మార్కెటింగ్ శాఖ అధికారి తనిఖీలు
అక్షర కిరణం, (మర్రిపాలెం): మర్రిపాలెం రైతు బజార్లో గురువారం జిల్లా వ్యవసాయ, వాణిజ్య, మార్కె టింగ్ శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు బజార్ లో రైతుల కార్డులు, డ్వాక్రా కౌంటర్లు, వ్యాపార దుకాణాలు పరిశీలించారు. రైతులు తీసుకొస్తున్న టమాటాలు, అనంతపురం నుండి వస్తున్న టమోటాలు పరిశీలించారు. రైతులకు బస్సు సౌకర్యం అవసరమైన వారికోసం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విధిగా నిర్వహించాలని రైతులందరూ పాల్గొనాలని సూచించారు. బోర్డులపై సూచించిన ధరలకే కూరగాయలు అమ్మాలని రైతుబజార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే బజార్లో సౌకర్యాల గురించి వినియోగదారులతో మాట్లాడి తెలుసుకున్నారు.