డిసెంబర్ 4న విజయవాడలో ప్రజాహక్కుల సభ కరపత్రాల ఆవిష్కరణ
అక్షరకిరణం, (వజ్రపుకొత్తూరు): తెలుగు నేల నుండి మతరాజకీయలాను తరిమికొట్టాలని ప్రజా పోరాటాలతోనే ప్రజలు హక్కులు పొందాలనే ప్రతిజ్ఞతో ముందుకు సాగాల ని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ పిలు పునిచ్చింది. డిసెంబర్ 4న విజయవాడ జింఖానా గ్రౌండ్లో నిర్వహించే ప్రజాహక్కుల సభకు సీపీఐ (ఎంఎల్) జాతీయ కార్యదర్శి దీపాంకార్ భట్టాచార్య, పార్లమెంట్ సభ్యులు హాజరుకానున్నారని తెలిపారు. కావున ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు పిలుపునిచ్చారు. పోస్టర్లు, కరపత్రాలు బొడ్డపాడు గ్రామంలో అమరవీరుల స్మారక భవనంలో విడుదల చేశారు. ఈకార్యక్రమంలో తన తోపాటు మద్దిల రామారావు, దున్న శ్రీనివాస్, కె.దుష్యంత్, పి.అప్పారావు, పి.కామేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, లోకనాథం, ముసలయ్య, జగదీష్, రామక్రిష్ణ, యుగంధర్, రాజారావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.