విజయనగరం జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
కసమీప బంధువు కాల్పుల్లో అప్పారావు మృతి
అక్షర కిరణం, (కొత్తవలస/ విజయనగరం ప్రతినిధి): విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆస్తి వివాదంలో నాటు తుపాకీతో కాల్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. సమీప బంధువు జరిపిన కాల్పుల్లో అప్పారావు అనే వ్యక్తి మృతి చెందాడు. కొత్తవలస మండలం ముసిరాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా గడిచిన వారం రోజుల్లో ఈ ప్రాంతంలో గన్ ఫైరింగ్స్లో ఇద్దరు మృతి చెందారు. ఇటువంటి వరుస ఘటనలతో స్థానికులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ ఘటనలో నిందితుడు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.