ధాన్యం అదనపు కొనుగోళ్లకు ప్రభుత్వం ఆదేశాలు
జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు
అక్షరకిరణం, (పొందూరు): నియోజకవర్గంలో అదనంగా లక్ష క్వింటాలు ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు వచ్చాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి కావడంతో అధికారులు కొనుగోలు నిలిపివేశారు. అయితే రైతుల కల్లాల్లో ధాన్యం ఇంకా ఉండి పోవడంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నియోజకవర్గంలో పొందూరు మండలంలో 35 క్వింటాలు, ఆమదాలవలస మండలంలో 25 క్వింటాలు, బూర్జ మండలంలో 25 క్వింటాలు, సరుబుజ్జిలి మండలంలో 15 క్వింటాలు ధాన్యం అదనంగా కొను గోలుకు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నారు. ఎమ్మెల్యే రవికుమార్ చొరవతో ప్రభుత్వం అదనంగా ధాన్యం కొనుగోళ్లకు ముందుకు రావడంపై రైతులు రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ధాన్యం విక్రయించుకోవాలని, దళారుల కు విక్రయించి మోసపోవద్దని రవికుమార్ సూచించారు.