ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశంలో సొసైటీ చైర్మన్ సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ జి.గణేష్కుమార్, తరుపన గుంటూరు లోని మంగళగిరిలోని సాంకేతిక విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ వి.పద్మారావు, జీవీవీఎస్ఎన్.మూర్తి, జాయింట్ సెక్రటరీ (విద్యా) సుధా సాగర్, విశాఖపట్నం డిప్యూటీ కలెక్టర్, ఎలిగెంట్ హోటల్ పవన్ కార్తీక్, ఆంధ్ర విశ్వ విద్యా లయం ఆకడమిక్ సెనేట్ సభ్యుడు కె.కుమార్ రాజా, విశాఖపట్నంలోని ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సమా వేశంలో సంస్థ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రస్తుత మానవ వనరుల కొరతను తీర్చడానికి కాంట్రాక్ట్ ప్రాతి పదికన అవసరమైన సిబ్బంది నియామకంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాశ్వత భూ కేటాయింపు, అధ్యా పక వేతనం సంస్థ ఆధునీకరణకు ఆర్థిక గ్రాంట్లపై కూడా చర్చలు జరిగాయి. అతిథ్య, పర్యాటక రంగంలో సంస్థ ఉన్నత నాణ్యత విద్యను అందించడం కొనసాగించేలా నియామ కాలు, పరిశ్రమ సహకారాలను బలోపేతం చేయడం మరియు శిక్షణ సౌకర్యాలను మెరుగుపరచడంపై తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని బోర్డు నొక్కి చెప్పింది.