జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్
కపహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు?
అక్షర కిరణం, (జమ్మూకశ్మీర్/జాతీయం): జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్ నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దచిగామ్ నేషనల్ పార్కు సమీపం లోని హర్వాన్‌లో.. ముఖ్యంగా ముల్నార్ ఏరియాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం నుంచి హోరా హోరీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు ‘‘ఆపరేషన్ మహాదేవ్’’ అని పేరు పెట్టారు.
సమగ్ర నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు యాంటీ-మిలిటెన్సీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం తో.. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదు లు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సుమారు ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తు న్నాయి. అంతేకాకుండా వీరు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులుగా భావిస్తు న్నారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న లష్కరే తొయిబా ఉగ్ర వాది సులేమాన్ షాను మట్టుబెట్టినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.
ఎదురుకాల్పుల ధ్వనులు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయని, ఇది ఒక తీవ్రమైన ఆపరేషన్ అని అధికారులు తెలిపారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి లేదా మట్టుబెట్టడానికి బలగాలు ఆ ప్రాంతం లో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. శ్రీనగర్‌లో ఉన్న ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తమ అధికా రిక ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ ఎన్కౌంటర్ గురించి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని అందిస్తోంది. మొత్తం ఆపరేషన్ పూర్తయిన తర్వాతే ఉగ్రవాదులను చంపారా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది.