ఏసీబీ వలలో అవినీతి ఎస్ఐ
కరూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కసీజ్ చేసిన షాపును ఓపెన్ చేసేందుకు లంచం డిమాండ్
అక్షర కిరణం, (అనకాపల్లి): అవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చేప చిక్కింది. అనకాపల్లి పట్టణానికి చెందిన ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి టౌన్ ఎస్ఐ దాసరి ఈశ్వరరావు రూ.50 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతడిని వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దాసరి ఈశ్వరరావు సీజ్ చేసిన షాప్ను తెరపించే విషయంలో రూ.50 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలో ఏసీపీ అధికారులు ఎస్ఐ ఈశ్వరరావును వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా ఈ కేసులో ఎస్ఐ ఈశ్వరరావు బాధితుడిని ముందుగా రెండు లక్షలు రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం.