పట్టాలు తప్పిన సీఎస్ఎంటీ షాలిమార్ ఎక్స్‌ప్రెస్
అక్షర కిరణం, (నాగపూర్/జాతీయం): నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కలంనా స్టేషన్ సమీపంలో సీఎంఎంటీ షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు మంగళవారంనాడు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, గాయపడటం కానీ జరగలేదని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం) దిలీప్ సింగ్ తెలిపారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుడా వారిని గమ్యానికి చేర్చేందుకు రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ దిలీప్ సింగ్ తెలిపారు. చెప్పారు. ఒక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశామన్నారు.