మహిళ దారుణ హత్య
కహత్య అనంతరం మృతదేహాన్ని కాల్చివేసిన వైనం కపోలీసుల పరిశీలన
అక్షర కిరణం, (సబ్బవరం): సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని గర్భిణీని హత్య చేసి కాల్చిపడేసిన సంఘటన గురువారం నగరంలో సంచలనం సృష్టించింది. సబ్బవరం మండలం బంజారి వద్ద గుర్తుతెలియని మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి కాల్చిపడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈమేరకు సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్- టీం పరిశీలించింది. హతురాలి వయసు 32 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలి కాళ్లు చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లను ఈసందర్భంగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. ఆయన పోలీసులను వివరాల అడిగి తెలుసుకున్నారు. ఈ హత్య కేసును ఛేదించేందుకు పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.