వింగ్ కమాండ్‌పై దాడి కసులో పెద్ద ట్విస్ట్
కముందుగా దాడి చేసింది ఆఫీసరే కసిసీ టీవీ పుటేజీల్లో వెల్లడి
అక్షర కిరణం, (బెంగళూర్/జాతీయం): భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్‌పై బెంగళూరు లో సోమవారం రోజు దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయనే తన భార్యతో కలిసి కారులో కూర్చుని మరీ.. రక్తం కారుతుండగానే ఓ వీడియో చేసి నెట్టింట పెట్టారు. కావాలనే కొందరు తమపై దాడికి పాల్పడ్డారని, పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు. అయితే తాజాగా ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బైకర్లు ఎవరూ వీరిని వెంబడిరచి, అడ్డుకోలేదని.. వీరే ఫుట్‌పాత్‌పై ఆగి కొందరు వ్యక్తులపై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యం గా ఆఫీసర్ బోస్యే ముందుగా బైకర్ ముఖంపై పంచు లు విసిరినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. వివరా లు ఇలా ఉన్నాయి.
భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్, ఆయన భార్య మధమితలు సోమవారం రోజు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో బోస్ ముఖం, మెడా, చేతుల నిండి రక్తం కారు తుండగా.. ఆయన పక్కనే కూర్చుని భార్య కారు నడుపుతూ కనిపించారు. అయితే తాము కారులో వెళ్తుండగా కొందరు బైకర్లు తమను వెంబడిరచి అడ్డగించారని చెప్పారు. ఎలాంటి కారణం లేకపోయినా తమను ఇష్టం వచ్చినట్లు తిట్టారని.. భార్యను దుర్భాషలాడుతుంటే తట్టుకోలేక తాను కిందకు దిగానని తెలిపారు. అప్పుడే బైకర్లు తనపైకి వచ్చి దాడి చేశారని పేర్కొన్నారు. తన కారు అద్దాలతో పాటు తల కూడా పగులగొట్టేందుకు యత్నించారన్నారు.
ఆపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు కూడా పట్టించుకోలేదన్నారు. ఎలాంటి చికిత్స తీసుకోకుం డా రక్తం కారుతుండగానే వీడియో చేసి సోషల్ మీడి యాలో పెట్టడంతో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆ వీడియోల్లో ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్న నిందితుడు వికాస్ కుమార్‌పై తొలుత ఆఫీసర్ బోస్యే దాడి చేసినట్లుగా కనిపిస్తోంది. ఆయన్ను ఆపేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడినట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. ఇవన్నీ పరిశీ లించిన పోలీసులు.. వింగ్‌కమాండర్ లక్ష్యంగా ఈ దాడి జరగలేదని, పరస్పరం జరిగిన దాడని అర్థం అవుతుందని చెప్పారు.
ముఖ్యంగా ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ స్పందించారు. సీసీటీవీ ఫుటేజీ పూర్తిగా పరిశీలించామని ఇదంతా చూస్తుంటే ఇరు వర్గాలు దాడి చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. అలాగే కమాండర్ రక్తస్రావం అవుతుండగానే పోలీస్ స్టేషన్‌కు వచ్చారని.. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించినట్లు తెలిపారు. కానీ వారు ఫ్లైట్‌కు ఆలస్యం అవుతుందంటూ వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. కానీ వీడియో విడుదల చేశాక.. ఆయన భార్య మధుమిత వివరాలు కనుక్కొని సంప్రదించామని.. ఆ తర్వాత ఆమె స్టేషట్కు వచ్చి ఘటనపై ఫిర్యాదు చేశారన్నారు. ఈక్రమంలోనే హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నామని.. ఆపీసర్ బోస్‌ను కూడా పిలిపించి విచారిస్తామని డీఎస్పీ దేవరాజ్ వెల్లడిరచారు.