అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలి
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అక్షర కిరణం, (అమరావతి): సంవిధాన్ దివస్... రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరు అభినందనీయం అన్నారు. 175 నియోజవకర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటా నని పేర్కొన్నారు. విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్గా వ్యవహరించారని చెప్పారు. ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామ న్నారు. మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకు న్నామని చెప్పారు. 28 ఏళ్లకే తాను ఎమ్మెల్యే అయ్యానని. యూనివర్సిటీలో చదువుకునేట ప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు. అందువల్లే తాను 9 సార్లు ఎమ్మెల్యే అయ్యానని, 30 ఏళ్లకే మంత్రి అయ్యానని, 40 ఏళ్లకు సీఎం అయ్యానని తెలిపారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారని తెలిపారు. తన కంటే చిన్న వయసులోనే మీరు మాక్ అసెంబ్లీకి వచ్చి సమర్థవంతంగా నిర్వహించారని అభినం దించారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ అద్భుతంగా తీర్చిదిద్దా రని, అంబేద్కర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలచి ఉంటారని అన్నారు. ఓటు హక్కు మనకు అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధమని తెలిపారు. దీనిని సక్రమంగా ఉపయోగిం చుకోవాలని సూచించారు.