ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న కూటమి నాయకులు
అక్షర కిరణం, (విజయవాడ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారిని కూటమి నాయకులు దర్శించుకున్నారు. బుధవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధుల కు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు విశేష పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనలు అందజేసి శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి తీర్ద ప్రసాదలు అందజేశారు.