అలరించిన బుట్ట బొమ్మ
కమద్దిల పాలెంలో బొమ్మన శారీ స్టోర్ ప్రారంభం
అక్షర కిరణం, (విశాఖపట్నం): వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్‌ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్‌ను ప్రారంభించారు. బొమ్మన సంస్థ అధినేత బొమ్మన సత్యరాజ్ కుమార్ కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడారు. నమ్మికకు, నాణ్యతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆధునిక డిజైన్ల తో కూడిన అన్ని చీరలు బుట్ట బొమ్మ శారీ స్టోర్‌లో లభ్యమ వుతాయని బొమ్మన సత్యరాజ్ కుమార్ తెలిపారు. 93 ఏళ్లుగా బొమ్మన కుటుంబాన్ని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని వారి అభిరుచికి అనుగుణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చేరువ చేసేందుకే ‘బుట్టబొమ్మ’ను ప్రారం భించామని తెలిపారు. ‘బుట్ట బొమ్మ’ అధినేత బొమ్మన మణిరాజ్ కుమార్ మాట్లాడుతూ సంప్రదాయం ఉట్టిపడేలా గద్వాల్, కంచి, ధర్మవరం వంటి చీరలు అందుబాటు ధర ల్లో లభ్య మవుతాయన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహిం చేలా వస్త్రాలను ఇక్కడ విక్రయించనున్నట్లు తెలిపారు. బొమ్మన సిల్క్స్ అధినేత బొమ్మన యువరాజ్ కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారాన్ని తమ కుటుంబం తరాలుగా కొనసాగిస్తుం దని, వారి బాటలో తాము కూడా విలువలతో షో రూంలు నడుపుతున్నామన్నారు. కార్యక్రమంలో బొమ్మన సునీత, బొమ్మన సంజన, బొమ్మన చంద్రిక తదితరులు పాల్గొన్నారు.