కళలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే ఉత్తరాంధ్ర జాతర
22న గురజాడ కళాక్షేత్రంలో కళాజాత బీచ్ రోడ్డులో రెండు వేల మందితో ప్రదర్శన
అతిథులుగా కందుల దుర్గేష్, సినీనటుడు బ్రహ్మానందం
రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వీవీ రమణమూర్తి
అక్షర కిరణం, (విశాఖపట్నం): తరతరాలుగా ఆదరణ కలిగి ఉన్న ఉత్తరాంధ్ర కళలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే ఈనెల 22న విశాఖలో ‘ఉత్తరాంధ్ర జాతర’ నిర్వహించనున్నట్టు ‘రైటర్స్ అకాడమీ’ అధ్యక్షులు వీవీ రమణమూర్తి తెలిపారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో 2 వేల మంది సమక్షంలో కళాజాత ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలతోపాటు సినీ కమేడియన్ బ్రహ్మా నందం కళాకారులు హాజరుకానున్నట్టు తెలిపారు. కళా సంఘాల ప్రతినిధులతో కలిసి రమణమూర్తి ‘పౌర గ్రంథాలయం’లో శనివారం మీడియాతో మాట్లాడారు. రైతాంగం నుంచి పుట్టిందే జానపదం అని, పనులు ముగిశాఖ సాయంత్రం వేళ పాటలు పాడి, డ్యాన్సులు చేసి ఆనందించేవారని, అలా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరుగున పడి పోతున్న సుమారు 50కళలను ఆ రోజు బీచ్ రోడ్డులో కనీసం 2వేల మంది కళాకారులు ప్రదర్శించనున్నారన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని లాభాపేక్ష లేకుండా, కళాకారు లు తమ గొప్పతనాన్ని పది మందికీ తెలియజేసేలా ఎవరికి వారే వచ్చి సహకరిస్తామన్నారని, ఉత్తరాంధ్ర జానపద జాతర ను అందరూ వచ్చి ఆదరించాలని కోరారు.
అద్భుతం..ఉత్తరాంధ్ర కళలు
ఉత్తరాంధ్రలో ఉన్న కళలు అద్భుతమని, అవి మరెక్కడా లేవని, పిల్లల నుంచి పెద్దల వరకు, మహిళలు, జాలర్లు, రైతు లు వచ్చి తమ కళల్ని ప్రదర్శిస్తారని రమణమూర్తి పేర్కొన్నారు. తమ కార్యక్రమాల్ని చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల కళాకా రులు, ప్రజాప్రతినిధులు స్పందించారని, తాము కూడా ప్రదర్శినలను పంపిస్తామని మంత్రి దుర్గేష్ లాంటి వారు హామీ ఇచ్చారన్నారు. ఉత్తరాంధ్ర కవిత్వం ప్రతిధ్వనించేలా కళా రూపాలుంటాయని, వంగపండు జానపదాలను మర్చి పోకుండా ఆయన వారసుడు కూడా కళలను ప్రదరిస్తార న్నారు. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి గుర జాడ కళాక్షేత్రం వరకు 1.5కి.మీ మేర వివిధ ప్రదర్శనలుం టాయన్నారు. ర్యాలీలూ కొనసాగుతాయన్నారు. 400మంది కార్యకర్తలతోపాటు ఎన్సీసీ, స్కౌట్లు, సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలుంటాయని, కళాకా రులతోపాటు అతిథులకు భోజనం, అల్పాహార సౌకర్యముం టుందన్నారు. రచయిత, కళా పోషకులు, సినీ నటుడు బ్రహ్మా నందం తనకు తానుగా ఈ కార్యక్రమానికి వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తూర్పు భాగవతం వంటి ప్రదర్శనల తోపాటు మనకు తెలియని, మన మధ్యే ఉన్న అనేక ప్రదర్శన లుంటాయన్నారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించి రోలర్ ట్రోఫీ, పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత, ఆచార్య డీవీ సూర్యారావు, కళాకారులు చిన్నారెడ్డి, విక్రమ్ గౌడ్, చలసాని కృష్ణ ప్రసాద్, ధనుంజయ్, వి. త్రినాథ్, బాదంగీర్ సాయి, వీర్రాజు, కొణతాల రాజు, వర్రె నాంచారయ్య, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.