కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి
భోగాపురం పరిసరప్రాంతాల్లో టూరిజంతోపాటు అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
హైవే వెంచర్స్‌లో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో నడుస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు చిన్న తరహా వ్యాపార సంస్థలు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ సీతమ్మధారలోని హైవే వెంచర్స్ రియల్ వ్యాపార సంస్థను సందర్శించారు. హైవే వెంచర్స్ అధినేత డాక్టర్ చింతాడ హేమారావు మెగాస్టార్ చిరంజీవి అభిమాని కావడంతో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ చిరంజీవి పేరుపై తయారుచేసిన కేక్‌ని కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈసందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడు తూ భోగాపురం పరిసర ప్రాంతా ల్లో టూరిజంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు నెలకొల్పేందుకు పెట్టుబడి దారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వ్యాపార సంస్థలు టూరిజంలో పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాల ను మరింతగా విస్తరించాలని పిలుపునిచ్చారు. హైవే వెంచర్స్ ఎండీ హేమారావు తనకు 15 సంవత్సరాల నుంచి పరిచయస్తుడని, చేసిన పనిలో క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న హేమరావు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. హైవే వెంచర్స్ అధినేత డాక్టర్ చింతాడ హేమారావు మాట్లాడుతూ వ్యాపారంతోపాటు సామాజిక, ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అన్నారు. సామాజిక సేవకు కట్టుబడి ఉన్నామన్నారు. వ్యాపార లాభా లలో కొంత సమాజ సేవకే ఉపయోగిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం వినా యక చవితికి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, అయ్యప్ప భక్తుల అన్న సమారాధనకు సంస్థ తరఫున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత ప్రజాసేవ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామ న్నారు. కార్యక్రమంలో సంస్థ బ్రాంచ్ మేనేజర్లు రమణారావు, వైదేహి మాధవి, డైరెక్టర్లు చింతాడ ఢల్లీిశ్వరరావు, సురేష్, బొడ్డేపల్లి చిరంజీవి,లోకనాథం, హరీష్, చిన్న బాబు, గణేష్, శ్రీనివాస్, స్వామి ప్రసాద్, యామిని, గోపాల కృష్ణ, తిలక్, శాంతి, ప్రసన్న, మౌనిక పాల్గొన్నారు.