48వ వార్డులో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలంటూ ఎంపీ శ్రీభరత్‌కు గంకల కవిత వినతి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం ఎంపీ, పార్లమెంట్ కామర్స్ స్టాండిరగ్ కమిటీ సభ్యులు శ్రీభరత్ ను 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 48వ వార్డులో మౌలిక సదుపాయాల నిమిత్తం మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. గంకల కవిత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో పేద, సామాన్య ప్రజలు వివాహ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రస్తుత రోజులలో ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేయాలని కోరారు. 48వ వార్డులో ఇందిరానగర్-1 పార్క్‌లో, ఇందిరానగర్ -2 నూకాలమ్మ గుడి వద్ద, ఇందిరానగర్-3 ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా, ఇందిరానగర్-5 వరుణ్ బజాజ్ షో రూమ్ వెనుక, జై భారత్ నగర్ సచివాలయం వద్ద, న్యూ శ్రీనివాస్ నగర్ లో, శ్రీనివాస్‌నగర్‌లో కొండ దేవత గుడి పక్కన,శ్రీనివాస్ నగర్ పోలీస్ లైన్ వద్ద ఎంపీ లాడ్స్ నిధులతో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ విషయమై ఎంపీ శ్రీభరత్ సానుకూలంగా స్పందించారని గంకల కవిత తెలిపారు.