వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బాల గోకులం, శ్రీకృష్ణ వేషధారణ పోటీలు
అక్షర కిరణం, (మాధవధార): లలిత కళల కోసం కృషి చేస్తున్న అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి, ఆధ్వర్యంలో వైభవ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో బాలగోకులం శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు. పదేళ్లలోపు బాల బాలికలకు నిర్వహించిన పోటీల్లో విజేతల కు బహుమతులు ప్రదానం చేశారు. దీంతోపాటు పాల్గొన్న అందరికి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు స్వామి, సంస్కార భారతి దక్షిణ మధ్య క్షేత్ర ప్రముఖ్ వి.శేఖర్, విశాఖపట్నం మహానగరం ప్రధాన కార్యదర్శి జగన్నాధ రావు, కృష్ణమోహన్, ఆర్ఎస్ఎస్ నాయకులు అన్నే నాగేశ్వరరావు, కృష్ణారావు పాల్గొన్నారు. నాలుగు నెలల చిన్నారి పోటీలలో పాల్గొనడం విశేషం. సంస్కార భారతి ధ్యేయగీతాన్ని సుబ్బలక్ష్మి ఆలాపించారు. వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.