విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు
అక్షర కిరణం, (విజయనగరం): విద్యార్థులు పరీక్షా సమయాల్లో ఒత్తిడికి గురికాకుండా ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పా రావు సూచించారు. గురువారం గుర్లలో, నెల్లిమెర్లలో గల కేజీబీవీ కేంద్రాన్ని ఆయన సందర్శించి పదవ తరగతి విద్యా ర్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్షలు రాసేటపుడు పా టించవలసిన, తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. చదువుతోపాటు ఆహారం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని తెలిపా రు. ఉపాధ్యాయ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించి ఏటువం టి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.