ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు
కఒక జవాన్, 20 మంది మావోయిస్టులు మృతి
అక్షర కిరణం, (ఛత్తీస్‌గఢ్/జాతీయం): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగుతోంది. ముఖ్యం గా ఈరోజు భద్రతా బలగాలు ఎన్కౌంటర్ జరపగా.. 20 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. వారు చేసిన దాడి లో ఓ జవాన్ కూడా చనిపోయారు. అయితే ఘటనలో హతమైన నక్సలైట్ల వద్ద నుంచి ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ వివరించారు. భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని.. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతె వాడ జిల్లాల సరి హద్దులో ఉన్న దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఇందులో భాగంగానే జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేష న్ చేశారు. ఈక్రమంలోనే ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో ఓ జవాన్ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు చేసిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతం అయ్యారు.
బీజాపూర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారని సమాచరం రావడంతో.. ఎన్కౌంటర్ చేయమని బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. అలాగే ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగానే నష్టం వాటిల్లిందని చెప్పారు. అయితే ఇంకా ఈ ఆపరేషన్ ముగియలేదని.. కాల్పులు కొనసాగుతున్నాయని వివరించారు. భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
అయితే ఇప్పటి వరకు తమకు అందిన సమాచారం ప్రకారం.. ఓ జవాన్ చనిపోయాడని, 20 మంది నక్సలైట్లు హతం అయ్యారని వెల్లడిరచారు. అంతేకాకుండా మావోయిస్టుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో ఓ సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారని వివరించారు