విశ్వవిద్యాలయాల ప్రగతిలో విద్యార్థులు పాత్ర ప్రశంసనీయం
కఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాల ప్రగతిలో విద్యార్థుల పాత్ర అత్యంత ప్రశంసనీ యమని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ నరసింహారావు కొనియాడారు. ఏయూ తెలుగు విభాగంలో ఆధునికీకరించిన సెమినార్ హాల్‌ను శుక్ర వారం ప్రిన్సిపాల్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ తాము 30 ఏళ్ల కిందట విధుల్లో చేరినప్పుడు ఆర్ట్స్ కలశాలలలో అంతంత మాత్రమే సదుపాయాలు ఉండేవన్నారు. ఒక దశ లో ఆర్ట్స్ కళాశాలలు అంటే అప్పట్లో చిన్న చూపుగా ఉండేవ న్నారు. క్రమేపి ఆ భావన పోయి నేడు నాక్ ర్యాంక్‌లలో సైతం ఆర్ట్స్ కళాశాలలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, పరి శోధకులు, ఆచార్యులు అందిస్తున్న సహాయ సహకారాలు ప్రసంసనీయం అన్నారు. తన పరిధి మేరకు ఆర్ట్స్ కళాశాల అన్ని విభాగాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు విభాగం అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఈ విభాగాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. తెలుగు విభాగం విద్యార్థులు నేడు ప్రతిభ పాటవాలు ప్రదర్శించి ఉన్నత స్థాయీ అవకాశాలు అందిపు చ్చుకుంటున్నాయన్నారు. విద్యార్థుల తరపున ప్రిన్సిపాల్, శాఖ అధ్యక్షులు జెర్రా అప్పారావును ద్వితీయ సంవత్సరం విద్యార్థి గంట్ల శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు విభాగం ఆచార్యులు గజ్జ యోహాను బాబు, వెంక టేశ్వర్లు యోగి, ఎ.ఈశ్వరమ్మ, కట్టెపోగు రత్న శేఖర్, పెండ్యా ల లావణ్య, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..