గాంధీజీ అహింస సిద్ధాంతం అనుసరణీయం
పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు న్యూ కరాసలో గాంధీజీ జయంతి
మహాత్మునికి ఎమ్మెల్యే నివాళులు స్థానిక సమస్యలు పరిష్కరిస్తాని హామీ
అక్షర కిరణం, (కరాస): జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన అహింసా మార్గం అనుసరణీయమని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.గణబాబు అన్నారు. జీవీఎంసీ 52 వవార్డు క్లస్టర్ ఇంచార్జ్ వెంకు మహంతి చంద్రశేఖర్ (చందు) ఆధ్వర్యంలో న్యూ కరాసాలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గణబాబు కాలనీవాసులు పార్టీ నాయకులతో కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో గాంధీజీ చేసిన పోరాటాలు దీక్షలు చాలా గొప్పవని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలు అనుసరణీయం అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి వార్డులో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రణా ళికలు రూపొందిస్తున్నానని ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. వార్డుల పరిధిలోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరి స్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మౌలిక వసతులైన వీధు లైట్లు, రహమ రహదారి మరమ్మత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
అనంతరం పారిశుధ్య కార్మికులకు దుస్తులు, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానికులు పూజారి సత్యనారాయణ, డి.వినోద్, డి.నాగు, పైలా జగన్, బి.శ్రీను, అంజిరెడ్డి, బెజవాడ లక్ష్మి, సంతోషి, విశాఖ పార్లమెంట్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యాముజాల తిరుమలరావు(వైటీఆర్), నగర ప్రధాన కార్యదర్శి మంద లపు వాసుదేవరావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూసపాటి బలభద్ర రాజు, వార్డ్ కార్యదర్శి పాలు శ్రీను, కొటాన ఈశ్వరరావు, వీవీ సూర్యనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.