నిత్య కృషివలుడు మెగాస్టార్ చిరంజీవి
కజనసేన నేత డాక్టర్ ధానేటి శ్రీధర్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సేవలు వెలకట్టలేనివని జనసేన నాయకుడు, ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ అన్నారు. నగరంలోని గుజరాతిపేట జంక్షన్లో చిరంజీవి సీనియర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదానం చేశారు. డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ చిరంజీవి నిత్య కృషివలుడని చెప్పారు. భార తీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలను చిరంజీవి లిఖించుకున్నారన్నారు. కొన్ని దశాబ్దాలుగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ చిత్రపరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారన్నారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి పేదప్రజల పాలిట ఆపద్బాంధ వుడుగా నిలిచారని కొనియాడారు. అన్నదానంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, టీడీపీ నాయ కులు అందవరపు సంతోష్, మెగాస్టార్ చిరంజీవి అభిమా నుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.