నకిలీ పోలీసుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి
అక్షరకిరణం, (విశాఖపట్నం సిటీ): పోలీస్ అని చెప్పి మోసాలకి పాల్పడుతున్న వ్యక్తిని ఎంవీపీ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. విలేఖరుల సమావేశంలో ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడిరచారు. పోలీసులు సీజ్ చేసిన వాహనాలను ఇప్పిస్తా నంటూ ప్రజలను మోసం చేసిన బాజీ జంక్షన్ నివాసితుడు లోచన్ కుమార్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. లోచన్ కుమార్‌పై గోపాలపట్నం, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్టు తెలిపారు. ఇలాంటి వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గతంలో పోలీసు అధికారులతో తీసుకున్న ఫొటోలు పేపర్ క్లిప్పింగ్స్ చూపిం చి ప్రజలు వద్ద డబ్బులు వసూలు చేశాడని పోలీస్ సీజ్ చేసిన వాహనాలు ఇప్పిస్తామని నమ్మబలికి రూ.69వేలు వసూలు చేశాడని వాటిని రికవరీ చేశామన్నారు. అపరి చిత వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ ఏ నరసింహమూర్తి సూచించారు. ఇలాంటి వ్యక్తులపై పోలీసు లకు ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో ఎంవీపీ సీఐ మురళి, ఎస్ఐ ధనుంజయనాయుడు పాల్గొన్నారు.